Thursday, July 28, 2011

మీ వ్యాఖ్యలు అభ్యంతరకరం

  • చిదంబరానికి రాఘవులు లేఖ
  • సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
మంగళవారం కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీల గురించి మీడియాతో మాట్లాడిన తీరు చూస్తోంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే గందరగోళం సృష్టించే విధంగా వ్యాఖ్యానించారని భావించాల్సి వస్తోందని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే సిపిఐ (ఎం) అభిప్రాయమని తెలిసినప్పటికీ కేంద్ర హోం మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించటం చాలా అభ్యంతరకరమని పేర్కొంటూ చిదంబరానికి బుధవారానికి లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం...
మంగళవారం ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయ పార్టీల గురించి ''ఆంధ్రప్రదేశ్‌ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి నెలకొంది. పార్టీలు అన్ని నిలువునా చీలిపోయాయి. కాంగ్రెస్‌, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అన్నీ చీలిపోయాయి. కేవలం ఇద్దరు సభ్యులున్న బిజెపి మాత్రమే, దీనికి మినహాయింపు'' అని మీరు చేసిన వ్యాఖ్య విస్తృతంగా ప్రచారం అయింది. మా పార్టీ వైఖరి మీకు బాగా తెలుసు. ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి మా కేంద్ర కమిటి ఇచ్చిన అభిప్రాయం, మీ సమక్షంలో రెండు సార్లు జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో మా పార్టీ చెప్పిన అభిప్రాయం మీకు తెలుసు. రాష్ట్రం సమైక్యంగా వుండాలన్నది సిపిఐ(ఎం) అభిప్రాయమని మీకు తెలిసి కూడా ఇలా వ్యాఖ్యానించడం చాలా అభ్యంతరకరం. ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించడానికి మీరు ఈ రకంగా వ్యాఖ్యానించినట్లు భావించవలసివస్తున్నది. రాష్ట్రంలో ఉన్న అనిశ్చిత పరిస్థితికి పూర్తిగా మీది, కేంద్ర ప్రభుత్వానిది భాధ్యత. శ్రీకృష్ణ కమిటి నివేదిక ఇచ్చి ఏడు నెలలు కావస్తున్నా రాష్ట్ర విభజన, సమైక్యత వివాదాన్ని పరిష్కరించకుండా నానబెడుతూ, కాలయాపన చేస్తూ ప్రస్తుత పరిస్థితికి రాష్ట్ర పార్టీలపై నెపం మోపుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి హాని చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రగతి దశాబ్దాల పాటు వెనకబడిపోయే ప్రమాదం వచ్చింది. పరిపాలన స్థంభించిపోయింది. ప్రజల గోడు పట్టించుకునే నాధుడే లేడు, ఇప్పటికైనా సమయం మించిపోకుండా సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాము''.

3 comments:

  1. అంటే సి.పి.ఐ అంత గట్టిగా, proactiveగా కాక చూచాయిగా చెప్పారని అర్థం అనుకుంటాను. అంటేగా, ఏదో speculate చేస్తున్నట్టుగా వుంది కాని కార్యాచరణకు పూనుకునేలా లేదు. గూర్ఖాలాండ్ డిమాండ్ వల్ల ఈ స్టాండ్ తీసుకున్నట్టు, లేదంటే ఓ చేయి వేసేవాళ్ళే అనిపించేట్టు వుంది.

    ReplyDelete
  2. మీరు సిపి ఐ గురించి అడుగుతున్నారా? లేక సిపి ఐ(ఎం) గురించి అడుగుతున్నారా? సిపి ఐ(ఎం) మొదటి నుండి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి వున్నది. ఈ విషయం మీకు తెలియంది కాదని నేను భావిస్తున్నాను. చిదంబరం ప్రకటన తెలంగాణ అంశం పై ఆయన నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తుంది. ఏ పార్టీ ఏ స్టాండ్ తో వుందో కూడా ఆయనకు తెలియదా, నాటకాలు కాకపోతే.

    ReplyDelete
  3. @ snkr గూర్ఖాలాండ్ డిమాండ్ పై మొదటి నుండి సిపి ఐ (ఎం) కాని, లెఫ్ట్ ఫ్రంట్ కాని ఒకే స్టాండ్ తో వున్నాయి. కాకపోతే జ్యోతిబసు నేత్రుత్వంలో మొదటి త్రైపాక్షిక ఒప్పందం జరిగిన ప్రజాస్వామిక ప్రక్రియలో జరగాలన్నదే సిపిఎం డిమాండ్. ఒక డిమాండ్ కోసం సిపిఎం ఏనాడు సిద్ధాంతాన్ని మార్చుకోదు. అలా అని ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా వుండదు.

    ReplyDelete